ఈ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- రాజనరసింహ 1 d ago

featured-image

TG : ప్రజలను భయపెట్టేలా ఎవరైనా హెచ్‌‌ఎంపీవీ పై ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే హెచ్ఎంపీవీ కేసులు విదేశాలలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది. ఈ క్రమంలో దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్రజలు ఈ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 2001లోనే హెచ్ఎంపీవీ వైరస్‌ను గుర్తించారని అన్నారు. శ్వాస వ్యవస్థపై ఈ వైరస్ స్వల్ప ప్రభావం చూపుతుందని తెలిపారు. విదేశాల్లో హెచ్ఎంపీవీ కేసుల నమోదు, పరిస్థితులను పరిశీలిస్తున్నామని మంత్రి రాజనరసింహ పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD